జ్యోతిష్య శాస్త్రం.... 27 నక్షత్రాలు.. 12 రాశులు.. నవగ్రహాలు.. ఆధారంగా ఉంటుంది. నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ. గణాలుగా మూడు రకము లయిన గణాలుగా విభజించ బడి ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలోగణాలను అనుసరించి గుణగణాలను గణిస్తారు. అలాగే ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధముల నాడీ విభజన చేయబడుతుంది.
ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలుగా ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలకు నిర్ణీతమైనవి
- 1) కృత్తిక ,ఉత్తర, ఉత్తరాషాడ ఇవి రవి నక్షత్రాలు.
- 2) రోహిణి, హస్త, శ్రవణం ఇవి చంద్ర నక్షత్రాలు.
- 3) మృగశిర, చిత్త, ధనిష్ట ఈ మూడు కుజుని నక్షత్రాలు.
- 4) ఆరుద్ర, స్వాతి, శతభిషం, ఇవి రాహు నక్షత్రాలు.
- 5) పునర్వసు, విశాఖ, పూర్వాబాద్ర ఇవి గురు నక్షత్రాలు.
- 6 పుష్యమి, అమారాధ, ఉత్తరాభాద్ర ఈ మూడు శని నక్షత్రాలు.
- 7) ఆశ్లేష, జ్యేష్ట, రేవతి ఇవి బుధ నక్షత్రాలు.
- 8) మఖ, అశ్వని, మూల ఇవి కేతు నక్షత్రాలు.
- 9) భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ మూడు శుక్ర నక్షత్రాలు.
జన్మనక్షత్రం ఏదో ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహ దశ జననకాల దశగా నిర్ణయిస్తారు.
మనం చేసే హోమాదులను గ్రహించి దేవతలకు అందించే సూర్యాగ్నిఅగ్ని ఐదు రకాలుగా ఉంటుంది. వీటిని పంచాగ్నులంటారు. జఠరాగ్ని, బడబాగ్ని, అరణ్యాగ్ని, ఇంద్రాగ్ని, సూర్యాగ్ని అనే ఐదు అగ్నులలో జఠరాగ్ని జీవులలో పుడుతుంది, బడబాగ్ని సముద్రంలో పుడుతుంది. అరణ్యాగ్ని రావికర్ర, జమ్మికరర్ర ఒకదానికొకటి రాసుకుంటే పుడుతుంది. ఇంద్రాగ్ని దేవేంద్రుని వజ్రాయుధంలో ఉంటుంది. సూర్యాగ్ని మాత్రం సూర్యుని తేజస్సును ఆశ్రయించి ఉండి....మనం చేసే హెూమాదిక్రతువులను గ్రహించి, దేవతలకు అందించి మానవాళికి ఎంతగానో మేలుచేస్తుంది
